ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు సమన్లను జారీ..
దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. ఈ కేసులో మరోసారి విచారణను ఎదుర్కొనాల్సిన పరిస్థిితి ఏర్పడింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులు కవితకు సమన్లను జారీ చేశారు. ఈ నెల 26వ తేదీన విచారణకు రావాల్సి ఉంటుందంటూ ఆదేశాలు ఇచ్చారు. గతంలో ఇదే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు…

