పాతబస్తీ మెట్రోకు శంకుస్థాపన.. ఎంఐఎంతో కలిసి అభివృద్ధి అంటూ సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు ..
పాతబస్తీ మెట్రో లైన్‌కు శుక్రవారం ఫరూక్‌నగర్ డిపో దగ్గర శంకుస్థాపన చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు మొత్తం 5.5 కిలోమీటర్ల పొడవునా 4 మెట్రో స్టేషన్లతో ఈ రైలు మార్గాన్ని నిర్మించనున్నారు. రూ. 2 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలని.. మిగితా సమయాల్లో అభివృద్ధికే ప్రాధాన్యత ఇస్తామన్నారు సీఎం…

