లోక్‌సభ ఎన్నికల బరిలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే..
లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల తరువాత తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తమ అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోన్నాయి. గెలిచే సత్తా ఉన్న వారికే టికెట్లను ఇస్తోన్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పటికే బీఆర్ఎస్ పలు స్థానాలకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. మహబూబాబాద్- మాలోత్ కవిత, కరీంనగర్- బీ వినోద్ కుమార్, పెద్దపల్లి- కొప్పుల…

