రూ. 500కే గ్యాస్, ఉచిత విద్యుత్ పథకాలను ప్రారంభించిన రేవంత్..
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక కష్టాలున్నా ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేస్తున్నామని, తాజాగా మరో రెండు పథకాలు ప్రారంభించుకున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మిగతా హామీలు కూడా ఒక్కొక్కటిగా తప్పకుండా అమలు చేస్తామని రేవంత్ స్పష్టం చేశారు. కాగా, అభయహస్తం గ్యారంటీల్లో ఇప్పటికే మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ రూ.10 లక్షలకు పెంపు పథకాన్ని అమలు…

