జూలై 17న రైల్ రోకోకు పిలుపునిచ్చిన కవిత..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుకునే వరకు తమ పోరాటం ఆగదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బీసీలందరూ ఈ విషయంలో చైతన్యవంతులు కావాలని ఆమె పిలుపునిచ్చారు. బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడితే, పదవులు వాటంతటవే బీసీ బిడ్డల కాళ్ల దగ్గరకు వస్తాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో కామారెడ్డిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించిన డిక్లరేషన్‌ను సాధించేంత వరకు పోరాడుతామని ఆమె అన్నారు. మెదక్ జిల్లాలో “కామారెడ్డి…