మూసీ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
మూసీ నది అభివృద్ధి ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. మూసీలో మురుగునీటిని ముందుగా శుద్ధి చేయాలని సీఎం సూచించారు. సోమవారం మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్‌గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మూసీ సరిహద్దులు, ఇతర వివరాలతో కూడిన పటాలను అధికారులు సీఎంకు వివరించారు. అధికారులు పని విభజన చేసుకొని మూసీ పరీవాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం…

