కొమురవెల్లిలో రైల్వే స్టేషన్.. నెరవేరుతున్న ఛిరకాల వాంఛ..
ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లన్న భక్తులకు ఛిరకాల వాంఛ తీరబోతోంది. కొత్తపల్లి-మనోహరాబాద్ నూతన రైలు మార్గంలో సిద్దిపేట జిల్లా కొమురవెల్లి ఆలయానికి సమీపంలో రైల్వే స్టేషన్ నిర్మాణానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్‌తో కలిసి భూమి పూజ చేశారు. అంతకుముందు వీరు మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, జనగామ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దశమంత్ రెడ్డి ఉన్నారు. …

