రూ. 500కే గ్యాస్, ఉచిత విద్యుత్ స్కీంలకు ఆమోదం..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అధికారిక గీతంగా ‘జయ జయహే తెలంగాణ’కు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయింది. ఈ మేరకు వివరాలను సమావేశం అనంతరం మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి మీడియాకు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇక నుంచి వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్‌కు టీజీగా…

