2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తాం: గత సర్కారులా కాదంటూ రేవంత్ రెడ్డి
ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 7094 మంది స్టాఫ్ నర్సులకు నియామకపత్రాలు అందజేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ద్వారా త్వరలో ఉద్యోగాల భర్తీ చేపడతామని సీఎం తెలిపారు. త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలు కూడా భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్…

