కేసీఆర్ సర్కారు అన్ని రంగాల్లో విఫలం: లెక్కలు చెప్పిన చిదంబరం..
తనకు తెలంగాణతో 2008 నుంచి అనుబంధం ఉందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పీ చిదంబరం. ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి 2009 డిసెంబర్ 9న చేసిన ప్రకటన తనకు బాగా గుర్తుందన్నారు. మరోవైపు, కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. Advertisement తెలంగాణలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం బాగా పెరిగిపోయిందని చిదంబరం ఆరోపించారు. దేశంలోని అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న రాష్ట్రం తెలంగాణేనని అన్నారు.…

