సీఈ రమణారెడ్డికి సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్..!
రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతి, నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని జలసౌధలో జరిగిన ఈ సమావేశంలో మహబూబ్‌నగర్ జిల్లా నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ (సీఈ) రమణారెడ్డికి సీఎం తీవ్ర హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. “అక్కడ (గతంలో పనిచేసిన చోట) చేసినట్లు ఇక్కడ కూడా చేస్తే కేసు పెట్టి లోపల వేయిస్తా” అంటూ సీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. రమణారెడ్డి గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులో…