TELANGANA

TELANGANA

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 15 నుంచి అన్ని పాఠశాలలకు ఒంటి పూట బడులు…

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మార్చి 15 నుంచి అన్ని పాఠశాలలకు ఒంటి పూట బడులు నడవనున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించారు. ఐతే దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదు. సాధారణంగా ప్రతి విద్యాసంవత్సరం వేసవి కాలంలో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు నడుస్తాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. త్వరలో అందుకు సంబంధించిన ఆదేశాలు జారీ…

APTELANGANA

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు..

తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్‌, ఉపాధ్యాయ MLC స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఓటర్లకు తాయిలాలు పంచేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం జరిగే ఎన్నికలకోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 3 గ్రాడ్యుయేట్‌, 2 టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరిరోజు కావడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవాలని అధికారపార్టీ ఉవ్విలూరుతుండగా, అటు విపక్షాలు ఆ స్థానాలను దక్కించుకునేందుకు జోరుగా…

APHealthNationalTELANGANA

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న H3N2 వైరస్‌…

దేశంలో వేగంగా వ్యాపిస్తోంది హెచ్‌3ఎన్‌2 వైరస్‌.. ఈ మాయదారి రోగం తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. మొన్నటి వరకూ కరోనా..ఇప్పుడు H3N2 వైరస్‌.. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే వేసవి తాపం మొదలైంది. ఇప్పుడు కొత్త వైరస్ దడ పుట్టిస్తోంది. హాంగ్‌కాంగ్‌ఫ్లూ H3N2 వైరస్.. ఈ పేరు చెప్తే ఇప్పుడు గుండెల్లో గుబులు రేపుతోంది. H3N2 వైరస్‌ కారణంగా సోకే ఇన్‌ఫ్లూయెంజానే హాంగ్‌కాంగ్ ఫ్లూ అంటున్నారు డాక్టర్లు. ఈ ఫ్లూ జ్వరం సోకి దేశంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందులో…

TELANGANA

తెలంగాణలో ముందస్తు ఎన్నికల పై సీఎం కేసిఆర్ క్లారిటీ…

తెలంగాణలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని గత కొన్ని రోజులుగా వార్తుల వస్తున్న విషయం తెలిసిందే. నిర్దేశిత సమయం కంటే ముందుగానే తెలంగాణలో ముందస్తు ఎన్నికలు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారంటూ వార్తలు చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ముఖ్యమంత్రి తాజాగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. శుక్రవారం జరిగిన బీఆర్‌ఎస్‌ సమావేశంలో ఈ విషయంపై సీఎం స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని సీఎం తేల్చి చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే…

TELANGANA

కొంతమంది ఎమ్మెల్యేలు సీఎం కెసిఆర్ వార్నింగ్…

ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాలకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు దళిత బంధు స్కీమ్‌ కింద డబ్బులు తీసుకుంటున్నట్టు తన దగ్గర సమాచారం ఉందన్నారు కేసీఆర్‌. అది మళ్లీ రిపీట్ అయితే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, పెన్షన్ల లాంటి వాటిని అందుకునే వారి సంఖ్య దాదాపు 50 వేల నుంచి 60 వేల మధ్య ఉందని.. వాళ్లందర్నీ కలిసేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలన్నారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ 27న నిర్వహించే…

TELANGANA

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ మీటింగ్‌…?

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ మీటింగ్‌ జరగనుంది.  మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన.. ఈ సమావేశం జరగనుంది. ఈ విస్తృతస్థాయి సమావేశంలో.. పార్టీ పార్లమెంటు సభ్యులు, శాసన సభ, శాసన మండలి సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు పాల్గొంటారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరు, పార్టీ కార్యకలాపాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. ఇది ఎన్నికల…

TELANGANA

ఈడి నోటీసుపై ఎమ్మెల్సీ కవిత స్పందన..?

ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులపై ఇప్పుడు హాట్ టాపిక్. ఢిల్లీ ఈడీ కార్యాలనికి రావాలని ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. అయితే ఈనేపథ్యంలో కవిత ఈడీకి లేఖ రాశారు. దీంతో ఈ వ్యవహారం కాస్త సంచలంగా మారింది. గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడి కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏమిటని ఈడికి ఎమ్మెల్సీ కవిత లేఖరాశారు. తనకు జారీ అయిన…

SPORTSTELANGANA

భారత్ — పాక్ మ్యాచ్ పై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు…

పాకిస్తాన్ లో జరిగే ఆసియా కప్ 2023కు భారత జట్టును పంపకూడదన్న నిర్ణయంపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ తో భారత్ క్రికెట్ ఎందుకు ఆడుతుందన్నారు. భారత జట్టును పాకిస్తాన్ లో ఆడేందుకు పంపకూడదని నిర్ణయించుకున్నప్పుడు.. రేపు పాక్ తో మ్యాచ్ ఎందుకు ఆడుతున్నారు?   పాక్ తో ఆడక పోతే ఏమవుతుంది మహా అయితే రెండు వేల కోట్లు నష్టం జరుగుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు…

TELANGANA

రేపు తెలంగాణ మంత్రివర్గం సమావేశం..

రేపు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది . ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసుల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించే అవకాశం ఉంది. ఇదే సమావేశంలో కవితను అరెస్టు చేస్తే ఏం చేయాలనే విషయంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. కాగా కవిత రిక్వెస్ట్ మేరకు ఈడీ ఆమెను ఈనెల 11న విచారించనుందని సమాచారం. అయితే.. ఈ క్రమంలోనే.. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో…

NationalTELANGANA

హైదరాబాద్ వేదికగా జీ-20 ఆర్థిక సదస్సు..

హైదరాబాద్ వేదికగా జీ-20 ఆర్థిక సదస్సు ప్రారంభమైంది. నగరంలోని ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (హెచ్‌ఐసీసీ)లో జరుగుతున్న సదస్సుకు 40 దేశాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. దేశంలో తొలి సమావేశం జనవరిలో కోల్‌కతాలో జరుగగా, రెండో సమావేశానికి హైదరాబాద్‌ వేదికగా నిలిచింది. ఇప్పటివరకు 25 నగరాల్లో 36 సదస్సుల నిర్వహించగా ఈ ఏడాది జీ-20 సదస్సుకు ఇండియా నేతృత్వం వహిస్తోంది. గ్లోబల్ సౌత్ దేశాల్లో ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలు, దేశాల అనుభవాలు, ఉత్తమ విజయగాధల అంశంపై ఈ సదస్సు…