చెన్నమనేని రమేశ్ పౌరసత్వం వ్యవహారంలో కొత్త ట్విస్ట్..
వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వం వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వం కలిగి లేనప్పటికీ, తప్పుడు పత్రాలు సమర్పించి గతంలో ఎన్నికల్లో పోటీ చేశారని ఆరోపిస్తూ ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో ఈ ఫిర్యాదు అందజేశారు. చెన్నమనేని రమేశ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో కోరారు. తన భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ…