అలిపిరి ఘటన సూత్రధారి, మావోయిస్ట్ అగ్రనేత ‘దేవ్‌జీ’ లొంగుబాటు: ముగిసిన నాలుగు దశాబ్దాల అజ్ఞాతం
మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకమైన పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మిలిటరీ కమిషన్ ఇన్‌ఛార్జ్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ మంగళవారం తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన ఈయన, 1980లలో విద్యార్థి దశలోనే ఉద్యమ బాట పట్టారు. గత 44 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉంటూ పార్టీలో అగ్రస్థాయికి ఎదిగిన దేవ్‌జీపై ప్రభుత్వం రూ. కోటి రివార్డు ప్రకటించింది. ఆయనతో పాటు మరో ముగ్గురు కీలక నేతలు కూడా జనజీవన స్రవంతిలోకి రావడం…

