హైదరాబాద్ మెట్రో ఫేజ్-2పై కేంద్రం కీలక ప్రకటన..
హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా కీలక ప్రకటన చేసింది. ఈ ప్రాజెక్టు ఆమోదానికి సంబంధించి ఎటువంటి నిర్దిష్ట కాలపరిమితి లేదని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోకన్ సాహూ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మెట్రో ప్రాజెక్టులు భారీ వ్యయంతో కూడుకున్నవని దీని…

