మృత్యుపాశంగా చైనా మాంజా: సంగారెడ్డిలో యువకుడి గొంతు తెగి దుర్మరణం!
సంగారెడ్డి జిల్లా ఫసల్వాది ప్రాంతంలో సంక్రాంతి పండుగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిషేధిత చైనా మాంజా (నైలాన్ దారం) ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బైక్పై వెళ్తున్న అద్వైత్ (22) అనే యువకుడి మెడకు గాలిపటం దారం చుట్టుకోవడంతో గొంతు తీవ్రంగా కోసుకుపోయింది. ఈ ప్రమాదంలో భారీగా రక్తస్రావం కావడంతో సదరు యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు అద్వైత్ బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఉపాధి నిమిత్తం సంగారెడ్డికి వలస వచ్చిన అతను,…

