మాజీ డీజీపీ మనవరాలి పేరుతో భారీ సైబర్ మోసం: వాట్సాప్ మెసేజ్‌తో రూ. 1.2 కోట్లు స్వాహా!
హైదరాబాద్ నగరంలో ఒక హైప్రొఫైల్ సైబర్ నేరం కలకలం సృష్టించింది. ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ డీజీపీ మనవరాలైన దివ్యారెడ్డి దొడ్ల పేరును ఉపయోగించి సైబర్ కేటుగాళ్లు ఏకంగా రూ. 1.2 కోట్లు కాజేశారు. వాట్సాప్‌లో ఆమె ఫోటోను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టి, తానే స్వయంగా మాట్లాడుతున్నట్లు నమ్మించి కంపెనీ అకౌంటెంట్‌ను బురిడీ కొట్టించారు. ఈ తరహా మోసాన్ని సైబర్ నిపుణులు ‘సీఈవో ఫ్రాడ్’ (CEO Fraud) లేదా ‘వాట్సాప్ ఇంపర్సనేషన్ స్కామ్’ అని పిలుస్తున్నారు. దొడ్ల డెయిరీ…

