కేటీఆర్‌కు సిట్ నోటీసులు.. కేసీఆర్‌తో హరీశ్ రావు అత్యవసర భేటీ: అంతా రాజకీయ కుట్రేనని బీఆర్ఎస్ ధ్వజం!
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ రాజకీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రత్యేక విచారణ బృందం (SIT) నోటీసులు జారీ చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ పరిణామంపై చర్చించేందుకు మరియు పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం కోసం మాజీ మంత్రి హరీశ్ రావు ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లి పార్టీ అధినేత కేసీఆర్‌తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. కేటీఆర్‌కు ఇచ్చిన నోటీసుల్లోని సెక్షన్లు మరియు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఈ…

