TELANGANA

TELANGANA

 ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: గెలుపు కోసం బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల ముమ్మర కసరత్తు; కింగ్ ఎవరో తేలేది నవంబర్ 11న

హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవంబర్ $11$న జరగనున్న ఉపఎన్నిక దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. మాగంటి గోపీనాథ్ మృతితో ఏర్పడిన ఈ ఉపఎన్నికను పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. బీఆర్ఎస్ ఈ ఎన్నికను ఛాలెంజింగ్‌గా తీసుకుని, అందరికన్నా ముందే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించి ప్రచారంలో ముందుంది. సానుభూతిని ఓటుగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న బీఆర్‌ఎస్‌కు, గ్రేటర్‌లో ఉన్న పలుకుబడి మరియు ఎమ్మెల్యేల బలం కలిసి వస్తాయని ఆ పార్టీ అంచనా వేస్తోంది. కేటీఆర్, హరీశ్‌రావు,…

TELANGANA

జూబ్లీహిల్స్ బరిలో బీజేపీ అభ్యర్థి ఫిక్స్..!

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల బరి మరింత రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ తమ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించడంతో త్రిముఖ పోరుకు రంగం సిద్ధమైంది.   గత కొంతకాలంగా పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నప్పటికీ, పార్టీ అధిష్ఠానం చివరకు దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపింది. ఆయన ప్రస్తుతం బీజేపీ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో…

TELANGANA

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా..!

2015 నాటి సంచలనాత్మక ఓటుకు నోటు కేసుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ జె.కె. మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ తో కూడిన ధర్మాసనం ఈ కీలక పిటిషన్లను పరిశీలించింది. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన రేవంత్ రెడ్డి, తనపై దాఖలైన కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా కేవలం ఎన్నికల చట్టాల కింద…

TELANGANA

మేడారం టెండర్ల విషయంలో మంత్రి కొండా సురేఖ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..!

మేడారం టెండర్ల విషయంలో తనకు ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా చిట్ చాట్‌లో మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడారం టెండర్లకు సంబంధించి ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.   మేడారం టెండర్ల విషయంలో తనకు ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని మంత్రి కొండా సురేఖ అన్నారు. ఆమె శాఖకు సంబంధించిన పనులన్నీ పారదర్శకంగా జరగాలనేదే తన ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ టెండర్ల ప్రక్రియలో…

TELANGANA

మాగంటి సునీతకు బీ ఫామ్, రూ.40 లక్షల చెక్కును అందజేసిన కేసీఆర్..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీతకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బీ ఫామ్ అందజేశారు. ఎన్నికల వ్యయం కోసం పార్టీ తరపున రూ. 40 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మాగంటి సునీతతో పాటు ఆమె కుమార్తె, కుమారుడు, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తదితరులు పాల్గొన్నారు.…

TELANGANA

జూబ్లీహిల్స్‌లో పోరు ప్రారంభమైంది… నిజం, ధర్మం మన వైపు ఉంది: కేటీఆర్..

జూబ్లీహిల్స్‌లో పోరు మొదలైందని, ప్రజలంతా బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. నిజం, ధర్మం కూడా బీఆర్ఎస్ పక్షానే ఉన్నాయని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్‌నగర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తూ, కాంగ్రెస్ పార్టీ గురించి, రేవంత్ రెడ్డి గురించి హైదరాబాద్ నగర ప్రజలకు బాగా తెలుసని, అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదని అన్నారు. అన్ని స్థానాల్లో బీఆర్ఎస్…

TELANGANA

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక… మొదటి రోజు ఎంత మంది నామినేషన్ వేశారంటే..!

జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా మొదలైంది. తొలి రోజే పది మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అయితే, ఆసక్తికరంగా ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులెవరూ మొదటి రోజు తమ నామినేషన్లను సమర్పించకపోవడం గమనార్హం.   తొలిరోజు బరిలోకి దిగిన 10 మందిలో ఇద్దరు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుంచి ఉండగా, మిగిలినవారు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. తెలంగాణ పునర్నిర్మాణ సమితి…

TELANGANA

ప్రభుత్వ వెల్ఫేర్ సొసైటీలకు.. రేవంత్ సర్కార్ స్పెషల్ ఫండ్..

ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలపై సీఎం రేవంత్ దృష్టి సారించారు. సమస్యల సత్వర పరిష్కారానికి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. సమస్యల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా, వెల్పేర్ సొసైటీలకు రూ.60 కోట్ల ఎమెర్జెన్సీ ఫండ్ ను విడుదల చేశారు. ఎస్సీ, బీసీ సొసైటీలకు రూ.10 కోట్లు చొప్పున నిధులను కేటాయించారు. ఈ నిధులను వినియోగించే అధికారులను సొసైటీ సెక్రటరీలకు కల్పించారు. సొసైటీల స్థాయిలోనే ప్రభుత్వ హాస్టల్స్ లో సమస్యలకు పరిష్కారం చూపనుంది.   ఫిజికల్…

TELANGANA

రేపు కోయంబత్తూరుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్….

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేపు కోయంబత్తూరు పర్యటనకు వెళ్లనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొనే ప్రతిష్ఠాత్మకమైన 10వ ఎఫ్‌ఎంఏఈ-నేషనల్ స్టూడెంట్ మోటార్ స్పోర్ట్స్ కాంపిటీషన్-2025 ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ కార్యక్రమం కోయంబత్తూరులోని కుమారగురు ఇన్‌స్టిట్యూషన్స్‌లో జరగనుంది.   ఈ విషయాన్ని బీఆర్ఎస్ తన అధికారిక సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ విద్యార్థులు తమ సాంకేతిక ప్రతిభను ప్రదర్శించే ఈ జాతీయ పోటీలకు కేటీఆర్…

TELANGANA

ఆరు గ్యారెంటీల లాగే, కాంగ్రెస్ 42 శాతం బీసీ రిజర్వేషన్లు కూడా ఓ డ్రామా: హరీశ్ రావు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించడం తెలిసిందే. ఈ పరిణామంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతోందని, బీసీలను మరోసారి మోసం చేసేందుకు కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని, వారి కుట్రలు ఇప్పుడు…