TELANGANA

TELANGANA

మావోయిస్టు కీలక నాయకురాలు నార్ల శ్రీవిద్య అరెస్టు..

మావోయిస్టు మహిళా నాయకురాలు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు నార్ల శ్రీవిద్యను మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీవిద్య హఫీజ్ పేటలో ఉంటూ చికిత్స పొందుతున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో ఆమె కదలికలపై నిఘా పెట్టారు.   మియాపూర్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను కోర్టులో హాజరుపరచకపోవడంతో పలు పౌర సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీంతో ఆమె అరెస్టును పోలీసులు ధ్రువీకరించారు. శ్రీవిద్య అరెస్టును మాదాపూర్ జోన్ డీఎస్పీ వినీత్ వెల్లడించారు.…

TELANGANA

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు.

హుజురాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత‌ పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ఆయనపై రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న‌ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.   దీంతో ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో రాజేంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి.. కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు…

TELANGANA

బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో కీలక పరిణామం..!

42 శాతం బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్‌ను న్యాయ సలహా నిమిత్తం కేంద్ర హోంశాఖకు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించగా, తాజాగా ఆయన దానిని కేంద్ర హోంశాఖకు పంపించారు. దీనితో బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.   సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ…

TELANGANA

తెలంగాణ క్యాబినెట్‌ భేటీ వాయిదా..

తెలంగాణ క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ రోజు సచివాలయంలో జరగాల్సిన క్యాబినెట్ భేటీని సోమవారానికి వాయిదా వేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు మంత్రివర్గం సమావేశం జరగాల్సి ఉంది. అయితే, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. అదేవిధంగా, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న ఏఐసీసీ సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం వాయిదా…

TELANGANA

ఓబులాపురం మైనింగ్ కేసులో.. IAS శ్రీలక్ష్మికి హైకోర్టు బిగ్ షాక్‌..

ఓబులాపురం మైనింగ్ కేసులో ఇవాళ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఓబులాపురం మైనింగ్ కేసులో IAS అధికారి శ్రీలక్ష్మి రివిజన్ పిటిషన్‌ను కొట్టేసింది. గాలి జనార్ధన్ రెడ్డికి చెందిన OMCకి గనులు కేటాయించడంలో శ్రీలక్ష్మి కీలకపాత్ర పోషించారనే అభియోగం ఉంది. ఇప్పుడు పిటిషన్ కొట్టేయడంతో సీబీఐ ఆమె పాత్రపై విచారణ చేపట్టనుంది.   శ్రీలక్ష్మి నిర్దోషి అంటూ గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది CBI. హైకోర్టులోనే OMC కేసులో…

TELANGANA

తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ లకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఆరుగురు ఐఏఎస్ అధికారులకు సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇచ్చారు.   నారాయణఖేడ్ సబ్ కలెక్టర్‌గా ఉమాహారతి, భైంసాకు అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్మూర్‌కు అభిజ్జాన్ మాల్వియా, కల్లూరుకు అజయ్ యాదవ్, భద్రాచలానికి మృణాళ్ శ్రేష్ఠ, బెల్లంపల్లి సబ్ కలెక్టర్‌గా మనోజ్‌ను నియమిస్తూ సీఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు.

TELANGANA

తెలంగాణ ముఖ్యమంత్రి పీఠంపై ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు..

బీజేపీలో కుల రాజకీయాలకు తావులేదని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ నాయకుడు ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా ఆసక్తికరంగా స్పందించారు.   బీజేపీలో కుల రాజకీయాలకు స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. బీసీ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్‌లో ఇరవై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారని గుర్తు చేశారు. ఆయన తర్వాత కూడా…

TELANGANA

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విమర్శలు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు చేశారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్లైట్ మోడ్ సీఎం అని ఎద్దేవా చేశారు. ఆయన ఈ రోజు కూడా ఢిల్లీకి వెళుతున్నారని, దేశ రాజధానికి వెళ్లడంలో ఆయన ఇప్పటికే అర్ధ సెంచరీ సాధించారని వ్యంగ్యం ప్రదర్శించారు.   ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఒప్పించే ప్రయత్నం చేయలేదని మండిపడ్డారు. అఖిలపక్షాన్ని…

TELANGANA

హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి అరుదైన ఘనత..!

హైదరాబాద్‌లోని నిమ్స్ యూరాలజీ విభాగం అరుదైన రికార్డును నెలకొల్పింది. గత ఆరు నెలల్లోనే 100 కిడ్నీ మార్పిడి సర్జరీలను విజయవంతంగా పూర్తి చేసింది. 1989లో ప్రారంభమైనప్పటి నుంచి మూత్రపిండ మార్పిడి అవసరమైన వారికి నిమ్స్ ఆశాదీపంలా కనిపిస్తోంది.   2015లో సీనియర్ ప్రొఫెసర్, విభాగాధిపతి డా. సి. రామ్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత శస్త్రచికిత్సల సంఖ్య గణనీయంగా పెరిగింది. డా. రామ్ రెడ్డి, సీనియర్ ప్రొఫెసర్ డా. రాహుల్ దేవరాజ్‌ల బృందం గత పదేళ్లలో 1000కి…

TELANGANA

జీమెయిల్ లో కొత్త ఫీచర్..? ఇక ఆ మెయిల్స్‌కు చెక్..!

గూగుల్ తన జీమెయిల్ లో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది, దీని పేరు ‘మేనేజ్ సబ్‌స్క్రిప్షన్స్’. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఇన్‌బాక్స్‌లో అవసరం లేని సబ్‌స్క్రిప్షన్ మెయిల్స్‌ను ఒక్క క్లిక్‌తో అన్‌సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు.   ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది?   ‘మేనేజ్ సబ్‌స్క్రిప్షన్స్’ డాష్‌బోర్డ్ ద్వారా వినియోగదారులు తాము సబ్‌స్క్రైబ్ చేసుకున్న అన్ని మెయిలింగ్ లిస్ట్‌లను ఒకే చోట చూడవచ్చు. ఈ డాష్‌బోర్డ్‌లో మీకు అవసరం లేని మెయిల్స్‌ను గుర్తించి, వాటి పక్కన…