రేషన్ కార్డులపై ‘స్మార్ట్’ రాజకీయం.. మోదీ ఫొటో ఎందుకు లేదంటూ బీజేపీ ఫైర్..!
తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి రంగం సిద్ధమైంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న సంగారెడ్డి వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు కార్డులు పంపిణీ చేయనున్నారు. అయితే పంపిణీకి ముందే కార్డులపై రాజకీయ వివాదం మొదలైంది.కార్డుపై ఇద్దరి ఫొటోలే..ప్రభుత్వం విడుదల చేసిన స్మార్ట్ రేషన్ కార్డు నమూనాలో సీఎం రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫొటోలు ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో…

