బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం.. స్పందించిన మహేశ్ కుమార్ గౌడ్..
బీఆర్ఎస్ సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు ఎంతమాత్రం విశ్వసించవద్దని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. “కాంగ్రెస్ హయాంలో రాష్ట్రంలో సాగుతున్న సామాజిక న్యాయం మరే ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పథకాలను ప్రవేశపెట్టింది. దీనికి…

