గోదావరి జలాలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..!
తెలంగాణలో రాబోయే పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని.. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని సీఎం రేవంత్ ప్రజలకు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథం వైపు వెళ్తుందని సీఎం అన్నారు. ‘సాయుధ రైతాంగ, రజాకార్ వ్యతిరేక పోరాటాల గడ్డ నల్గొండ జిల్లా. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో…