తెలంగాణలో యూరియా కొరతపై విచారణ జరపాలి: కేటీఆర్..
తెలంగాణలో తీవ్రమైన ఎరువుల కొరత నెలకొందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై తక్షణమే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ స్పందించారు. “సబ్సిడీపై రూ.266.50కి లభించాల్సిన యూరియా బస్తా ధర, ఇప్పుడు రూ.325కి ఎందుకు పెరిగింది? దీనికి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, ప్రజలకు సమాధానం చెప్పాలి” అని…