World

World

కేరళలో జననం.. అమెరికాలో వ్యాపారం.. అధ్యక్ష పదవి కోసం బరిలోకి..ఎవరీ వివేక్ రామస్వామి

అమెరికా ఉపాధ్యక్షురాలుగా భారత మూలాలు ఉన్న కమలా హరీస్ వ్యవహరిస్తున్నారు.అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నే ప్రతి నిర్ణయంలోనూ ఆమె కీలకంగా ఉంటున్నారు. అయితే ఇప్పుడు ఆమె ప్రత్యర్థి పార్టీలోని ఒక వ్యక్తి కూడా అధ్యక్షుడయ్యే స్థాయికి ఎదిగాడు. భారత మూలాలు ఉన్న ఈ వ్యక్తి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, పరిక మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నకు నిద్రలేని రాత్రులు పరిచయం చేస్తున్నాడు. ఇంతకీ అతడు ఎవరు? భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అమెరికాలో ఆ…

World

20 బంతుల్లో 1 పరుగు.. 3 వికెట్లు

ఆస్ట్రేలియా యువ పేసర్‌ స్పెన్సర్‌ జాన్సన్‌ సంచలన స్పెల్‌తో మెరిశాడు. ది హండ్రెడ్‌ లీగ్‌లో అరంగేట్రంలోనే అత్యద్భుత గణాంకాలు నమోదు చేశాడు. 20 బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్‌ హండ్రెడ్‌ లీగ్‌లో జాన్సన్‌ ఓవల్‌ ఇన్విసిబుల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో లండన్‌లోని కెన్నింగ్‌టన్‌ ఓవల్‌ వేదికగా మాంచెస్టర్‌ ఒరిజినల్స్‌తో మ్యాచ్‌లో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. అంతర్జాతీయ టీ20 జట్టుకు ఎంపికైన మరుసటి రోజే 20…

World

ప్రపంచాన్నే దడదడలాడించిన కరోనా మహమ్మారి పోయిందనుకుంటే మళ్లీ వార్తలు

2020లో ప్రపంచాన్నే దడదడలాడించిన కరోనా మహమ్మారి పోయిందనుకుంటే మళ్లీ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఈ ఏడాది మేలో గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ కేటగిరీ నుండి కరోనా వైరస్‌ను తొలగించింది. అప్పటినుంచి కోవిడ్ ముగిసిందని ప్రపంచం మొత్తం అనుకుంటున్నప్పటికీ.. ఇప్పుడు వైరస్‌కు సంబంధించిన కొత్త సమాచారం తెలుస్తోంది. ఇటీవల ఇండోనేషియా రాజధాని జకార్తాలోని ఒక వ్యక్తి నుండి వేరియంట్ ను కనుగొన్నారు. దానిని డెల్టా యొక్క 113 రెట్లు ఉత్పరివర్తన రూపాంతరంగా కనుగొన్నారు. ఇది…

World

రష్యా సైన్యంపై దాడి చేయడానికి ఉక్రెయిన్ ఉత్తర కొరియా రాకెట్లను ఉపయోగిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తన కథనం

రష్యా సైన్యంపై దాడి చేయడానికి ఉక్రెయిన్ ఉత్తర కొరియా రాకెట్లను ఉపయోగిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఓ మిత్ర దేశం ఆ ఆయుధాలను గతంలో రష్యా నుంచి స్వాధీనం చేసుకుని.. తమకు సరఫరా చేసినట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ తెలిపినట్లు వార్తాసంస్థ వెల్లడించింది. సముద్రం ద్వారా పంపిన సరుకులతో సహా రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలను అందజేస్తోందని అమెరికా ఆరోపించింది. అదే సమయంలో, దీనికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు సమర్పించబడలేదు. ఉక్రెయిన్ యుద్ధ…

World

బుల్లెట్ మోడల్లో హోండా మంకీ బైక్.. డిజైన్, బాబర్ స్టైల్ అదుర్స్..

హోండా మోటార్‌సైకిల్ తాజాగా హోండా మంకీ స్పెషల్ ఎడిషన్ బైక్‌ను విడుదల చేసింది. ఇప్పటికే హోండా నుంచి అనేక బైక్‌లు ఇంకా స్కూటర్లతో కస్టమర్లను ఆకట్టుకోగా.. ఇప్పుడు మరో కొత్త బైక్ ను విడుదల చేసింది. ఈ బైక్‌లో 125సీసీ ఇంజన్ ఉంది. లుక్ లో ఈ బైక్ బుల్లెట్ బైక్ కంటే ఎక్కువ. థాయ్‌లాండ్‌కు చెందిన హోండా ఈ స్పెషల్ ఎడిషన్ బైక్‌ను రిలీజ్ చేసింది. ఈ బైక్ ధర విషయానికోస్తే.. 108,900 THB అంటే…

World

అమెరికన్ కంపెనీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు

భారతదేశంలో ఒకప్పుడు అత్యధిక ప్రజాదరణ పొందిన అమెరికన్ బ్రాండ్ ‘ఫోర్డ్’ (Ford) ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి తెలిసింది. అయితే తన కస్టమర్లకు సర్వీస్ వంటివి అందిస్తోంది. కాగా ఇటీవల ఈ సంస్థకు సుప్రీంకోర్టు ఏకంగా రూ. 42 లక్షల జరిమానా విధించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఒక కస్టమర్ డీలర్‌షిప్ నుంచి ‘ఫోర్డ్ ఎండీవర్’ 3.2 లీటర్ వెర్షన్‌ను కొనుగోలు చేసారు.…

World

అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్‌పై రిపబ్లికన్లు అభిశంసన తీర్మానం

అమెరికా ప్రెసిడెంట్ జోబైడెన్‌పై రిపబ్లికన్లు అభిశంసన తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యారు. అంతర్జాతీయ లంచం కేసులో అతని ప్రమేయాన్ని వివరించే ఎఫ్‌బిఐ పత్రాలు బయటకు వచ్చిన నేపధ్యంలో బైడెన్‌పై అభిశంసనానికి రెడీ అయ్యారు. సెనేటర్ చక్ గ్రాస్లీ ఎఫ్‌డీ-1023 ఫారమ్‌ను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. దానిలో బైడెన్‌, అతని కుమారుడు హంటర్ తాము చేసిన సహాయానికి బదులుగా కైవ్‌కు చెందిన బురిస్మా హోల్డింగ్స్ సీఈఓను మిలియన్ల డాలర్లు చెల్లించాలని ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆరోపించారు. వైట్ హౌస్‌లో అత్యంత అవినీతి…

World

పాకిస్తాన్‌లో అంజు ప్రేమికుల పుకారు

పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్ నేపథ్యం, భారతదేశంలోకి ఆమె అక్రమ ప్రవేశంపై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఒక భారతీయ మహిళ ఇప్పుడు తన ప్రేమికుడిని కలవడానికి సరిహద్దు దాటి వెళ్లింది. రాజస్థాన్‌లోని భివాడి జిల్లాకు చెందిన ఒక వివాహిత భారతీయ మహిళ, తాను ఫేస్‌బుక్‌లో స్నేహం చేసి, ప్రేమలో పడిన వ్యక్తిని కలవడానికి పాకిస్తాన్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌కు వెళ్లింది. అంజు అనే 35…

World

ఐరాసలో అనూహ్య పరిణామం-భారత్ మద్దతుతో పంతం నెగ్గించుకున్న పాకిస్తాన్.. !

చిరకాల ప్రత్యర్ధులైన భారత్, పాకిస్తాన్ లు కలిసి పనిచేస్తే ఎలా ఉంటుంది ? దీనికి సమాధానం ఐక్యరాజ్యసమితిలో దొరికింది. ఐరాసలో గతంలో ఎన్నో అంశాల్లో విభేదిస్తూ పరస్పరం తీవ్ర విమర్శలు చేసుకునే ఇరుదేశాలు ఈసారి మద్దతిచ్చుకున్నాయి. దీని ఫలితంగా భారత్ పై నిత్యం విషం కక్కే పాకిస్తాన్ ఐరాసలో తన పంతం నెగ్గించుకుంది. భారత్ తో పాటు చైనా కూడా ఈ విషయంలో పాకిస్తాన్ కు అండగా నిలిచాయి. యూరప్ లోని స్వీడన్ లో ఖురాన్ దహనం…

World

ఎలాన్ మస్క్ మరో సంచలనం

ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్.. మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు. టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఉన్నన్ని రోజులూ రోజుకో సంచలనం రేపుతూ నిత్యం వార్తల్లో నిలిచిన ఈ అపర కుబేరుడు.. తాజాగా ఓ కొత్త స్టార్టప్‌ను స్టార్ట్ చేశారు. కార్పొరేట్ సెగ్మెంట్‌లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. భవిష్యత్‌లో మనుషుల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేయొచ్చనే అంచనాలు ఉన్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ రంగంలో పూర్తిస్థాయిలో అడుగుపెట్టారు…