హెచ్ 1 బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు శుభవార్త
అమెరికాలో ఉద్యోగం చేయడానికి అవకాశం కల్పించే హెచ్ 1బీ (H-1B vis) వీసా ఉన్నవారికి కెనడా శుభవార్త తెలిపింది. హెచ్ 1 బీ వీసాదారులు కెనడా (Canada)లో ఉద్యోగం చేయడానికి ఓపెన్ వర్క్ పర్మిట్ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ప్రతీ సంవత్సరం 10 వేల మందికి ఈ అవకాశం కల్పిస్తామని వెల్లడించింది. అలాగే, హెచ్ 1 బీ వీసాదారుల కుటుంబ సభ్యులకు కెనడాలో ఉద్యోగం చేయడానికి కానీ, చదువుకోవడానికి కానీ ఎలాంటి ఆంక్షలు లేకుండా అనుమతి ఇస్తున్నట్లు…