CINEMA

ప్రభాస్ ప్రాజెక్ట్‌ K నుండి న్యూ ఇయర్ స్పెషల్‌ సర్‌ ప్రైజ్‌

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ప్రాజెక్టు కే. ఈ సినిమా టైం ట్రావెల్ నేపథ్యంలో సాగుతుందనే విషయం తెలిసిందే. వైజయంతి మూవీస్ వారు ఈ సినిమాను 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఈ సినిమాలో అమితాబచ్చన్ మరియు దీపికా పదుకొనే ఇంకా బాలీవుడ్ హీరోయిన్ మరొకరు కూడా ఉండడంతో అంచనాలు అక్కడా ఇక్కడా కూడా ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్ సభ్యులు పంచుకున్నారు.

ప్రభాస్ ప్రాజెక్ట్‌ K నుండి న్యూ ఇయర్ స్పెషల్‌ సర్‌ ప్రైజ్‌ఒక వీల్ తయారీ కోసం చిత్ర యూనిట్ సభ్యులు ఎంతగా వర్కౌట్ చేశారో ఈ వీడియోలో చూపించడం జరిగింది. షో రూమ్ కి వెళ్తే ఎలాంటి వీల్ అయినా ఈజీగా లభిస్తుంది. కానీ వీళ్లు మాత్రం మొదట స్కెచ్ వేసి ప్రత్యేకంగా ఆ డిజైన్ తయారు చేశారు. ఆ వీల్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి.. కథ లో ఆ వీల్ ఎలా భాగస్వామ్యం అవుతుంది అనేది సినిమా విడుదలయితే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు. మొత్తానికి చిన్న విషయానికి కూడా ఎక్కువ వర్కౌట్ చేసి యూనిట్‌ సభ్యులు ఎక్కువ కష్టపడుతున్నట్లు దీని ద్వారా వారు చెప్పకనే చెప్పారు. ఈ మేకింగ్ వీడియోను చూస్తూ ఉంటే కచ్చితంగా ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా నిలవడం ఖాయం అంటూ ప్రభాస్ అభిమానులు ధీమాతో ఉన్నారు. ఈ సినిమా నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. 2023 లో ఈ సినిమా ఉంటుందా అంటూ ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.