CINEMA

మళ్లీ దొరికి పోయిన రౌడీ స్టార్‌, శ్రీవల్లి

విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారు అంటూ గీతా గోవిందం సమయం నుండి ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ తో ప్రేమలో పడ్డ కారణంగానే రష్మిక మందన్నా తన వివాహ నిశ్చితార్థాన్ని కూడా క్యాన్సిల్‌ చేసుకుంది అంటూ అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. డియర్ కామ్రెడ్‌ సమయంలో కూడా ఇద్దరి మధ్య వ్యవహారం చాలానే సాగింది అనేది అప్పటి ప్రచారం. ఎన్ని సార్లు ఏ ప్రచారాలు జరిగినా కూడా విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నా లు మాత్రం తాము ఇద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ చెబుతూ వచ్చారు. హీరోయిన్ తో ఒక హీరో స్నేహంగా ఉండవద్దా అన్నట్లుగా ఆ మధ్య ఎదురు ప్రశ్నించారు. సరే ఇద్దరు స్నేహితులే అనుకుంటున్న సమయంలో మళ్లీ మళ్లీ వీరిద్దరు అనుమానం కలిగించే పనులు చేస్తూనే ఉన్నారు.

తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా విజయ్ దేవరకొండ షేర్‌ చేసిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. స్విమ్మింగ్‌ పూల్ లో వైన్ బాటిల్ ఓపెన్ చేస్తూ చిల్‌ అవుతున్న ఫొటోలో రౌడీ స్టార్‌ అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే బ్యాక్ గ్రౌండ్‌ తో రష్మిక మందన్నా కూడా ఒక ఫొటోను షేర్‌ చేసింది. మినిమం నాలెడ్జ్ ఉన్న వారు కూడా ఈ రెండు ఫొటోలు కూడా ఒక్కసారి తీసినవే.. ఒకే చోట తీసినవే అంటూ గుర్తించవచ్చు. అంటే ఇద్దరు కూడా ఆ సమయంలో పక్క పక్కనే ఉన్నారు. గతంలో కూడా ఇలాంటి ఫొటోలతో వీరిద్దరి మధ్య వ్యవహారం చాలా సాగుతుందని వెళ్లడి అయ్యింది. ఈసారి మరింత స్పష్టంగా వీరి యొక్క వ్యవహారం బయట పడిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికి కూడా విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నాలు తాము ఇద్దరం మంచి స్నేహితులం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.