2022లో చాలామంది సినీ సెలబ్రిటీలు వారు ప్రేమించిన వాళ్లను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయ్యారు. మరి కొంతమంది సెలబ్రిటీ జంటలు పిల్లల్ని కూడా కన్నారు. ఇక గత ఏడాది బాలీవుడ్ స్టార్ జంట అలియా భట్ రన్బీర్ కపూర్ పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చారు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార విగ్నేష్ శివన్ లు ఇద్దరు కవల పిల్లలకు సరోగసి ద్వారా జన్మనిచ్చారు. అలాగే కాజల్ కూడా ఓ బాబుకు జన్మనిచ్చింది. స్టార్ కోలీవుడ్ స్టార్ నటులైన ఆది పినిశెట్టి నిక్కీ గల్రాని ఇలా మరికొంతమంది సినీ జంటలు పెళ్లితో ఒక్కటయ్యారు. ఇక తాజాగా మరో హీరోయిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతుందట. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఏడాది బాలకృష్ణ (Balakrishna) హీరోగా వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం పెళ్లి చేసుకోవడానికి రెడీ అయినట్లు సోషల్ మీడియాలో ఒక క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతుంది. చీర కడితే తెలుగుదనం ఉట్టిపడేలా ఉండే ఈ బ్యూటీ ప్రస్తుతం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు నిర్ణయం తీసుకుందని తన సన్నిహిత వర్గాల నుండి ఒక టాక్ వినిపిస్తోంది. ఈమె తెలుగులో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలు ఈమెకు మంచి పేరుని తెచ్చిపెట్టాయి.కానీ బాలకృష్ణ లాంటి స్టార్ హీరోతో నటించినా కూడా ఈమెకు వరుస అవకాశాలు రాలేకపోయాయి. ఇక సినీ కెరియర్ పక్కన పెడితే ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) ప్రస్తుతం తన చిన్ననాటి స్నేహితున్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిందట. ఇక ఈ విషయాన్ని తన సన్నిహితుల దగ్గర కూడా చెప్పినట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలిసిన చాలామంది కొత్త సంవత్సరంలో మంచి నిర్ణయం తీసుకుందని మెచ్చుకుంటుంటే, ఇంకొంతమందేమో అసలు ఈ విషయం నిజమో అబద్ధమో తెలియాలంటే ఆ హీరోయిన్ కచ్చితంగా క్లారిటీ ఇవ్వాలని భావిస్తున్నారు. మరి ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) నిజంగానే పెళ్లి చేసుకోబోతుందా లేదా తెలియాలంటే ఆమె ఆఫీషియల్ గా ప్రకటించే వరకు వేచి చూడాలి.