తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్వయంకృషితో ఎదిగి ఎన్నో సంచలనాలు సృష్టించిన చిరంజీవి తన సినిమాలతో మరెన్నో రికార్డ్లు క్రియేట్ చేశారు. ఒక తెలుగులోనే భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన తన సేవా గుణంతో దేశవ్యాప్తంగా మరింత పాపులారిటీ దక్కించుకోవడం గమనార్హం. అడిగిన వారికి కాదనకుండా చేయూతని అందిస్తూ వచ్చిన చిరంజీవి ముఖ్యంగా కరోనా సమయంలో ఎంతోమందిని ఆదుకున్నారు. అలాగే బ్లడ్ బ్యాంకు వంటి వాటి ద్వారా ఇప్పటికీ ఎంతోమంది ప్రజల సహాయాన్ని పొందుతున్నారు. ఎప్పటికప్పుడు అభిమానులలోకి వెళ్లి తన పరిచయాన్ని పెంచుకుంటున్న చిరంజీవి (Chiranjeevi)మరింతగా ప్రేక్షకులకు దగ్గరగా వెళ్తున్నారని చెప్పవచ్చు.
ఇది ఇలా ఉండగా ప్రజల కోసమే ఇంతలా ఆలోచించే చిరంజీవి తన కుటుంబ సభ్యుల గురించి ఆలోచించకుండా వుంటారా? ముఖ్యంగా చిరంజీవి తాను సంపాదించిన ఆస్తిలో తన ఇంటి ఆడపిల్లలకు ఖర్చు పెట్టడంలో ఏమాత్రం వెనుకాడడు . ఈ క్రమంలోనే భార్య సలహా మేరకు తన చెల్లెళ్లకు కోట్ల రూపాయల విలువైన భూములను బహుమతిగా ఇచ్చిన చిరంజీవి.. ఇప్పుడు కూతురు కోసం కూడా 35 కోట్ల రూపాయల విలువైన బంగ్లాను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాను తెరకెక్కిస్తున్న సినిమాల ద్వారా వచ్చిన డబ్బుతో హైదరాబాదులోని ఎమ్మెల్యే కాలనీలో తన చిన్న కూతురు శ్రీజ కోసం 35 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక అందమైన బంగ్లాను కొనుగోలు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఆమెకు ఈ బంగ్లా ఇవ్వడానికి గల కారణం ఏమిటి అంటే.. శ్రీజ మొదటిసారి బ్రాహ్మణ వ్యక్తిని వివాహం చేసుకొని.. ఒక కూతురికి జన్మనిచ్చిన తర్వాత అతడి నుంచి విడాకులు తీసుకుంది. ఇప్పుడు రెండవ భర్త కళ్యాణ్ దేవ్ కి కూడా ఆమె దూరమైంది. అయితే ఈ బంధానికి గుర్తుగా కూడా మరొక బిడ్డ జన్మించింది. ప్రస్తుతం ఈ ఇద్దరు పిల్లలను దృష్టిలో పెట్టుకొని వీరికి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చిరంజీవి ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం . అందుకే తన చిన్న కూతురు శ్రీజ కోసం 35 కోట్ల రూపాయల విలువైన బంగ్లాను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది.