CINEMA

మరో తెలుగు పాన్ ఇండియా మూవీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్‌

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమా మే 12 వ తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగులోనే కాకుండా ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ సూపర్ మాన్.. సూపర్ హీరో సినిమాను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు గతంలోనే ప్రకటించారు. ఈ సినిమా పై ఉన్న అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంది.

తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడం, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపానీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. పాన్ వరల్డ్ మూవీగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నందుకు సంతోషంగా ఉందంటూ చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా ద్వారా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో తేజ సజ్జా మరియు అమృత అయ్యర్ ల పాత్రలు విభిన్నంగా ఉంటాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇక హనుమాన్ పాత్రకు సంబంధించిన విజువల్స్ అద్భుతంగా ఉంటాయని ప్రశాంత్ వర్మ తెలియజేశాడు. ఇది ఒక విజువల్ వండర్ సినిమా అన్నట్లుగా ఉంటుందని ప్రశాంత్ వర్మ పేర్కొన్నాడు.