టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు(Dil Raju) పేరు గత కొద్ది రోజుల నుంచి వార్తలు మారుమోగిపోతుంది. ఈయన నిర్మాణంలో రూపుదిద్దుకున్న తమిళ చిత్రం `వరిసు(తెలుగులో వారసుడు)` కాణంగా టాలీవుడ్ లో థియేటర్ల ఇష్యూ ఏర్పడింది. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో ఉండగా తమిళ డబ్బింగ్ సినిమా వారసుడు కోసం దిల్ రాజు అత్యధిక థియేటర్స్ ను లాక్ చేసేశాడు. దానికి తోడు మల్టీప్లెక్స్ లు, భారీ స్క్రీన్లు, మంచి థియేటర్లుగా పేరున్న వాటినన్నింటిని దిల్ రాజు వారసుడు(varasudu) సినిమాకే కేటాయించారు. ఈ విషయంపై దిల్ రాజును ఓ రేంజ్ లో ఏకేశారు. తెలుగు సినిమాల కంటే డబ్బింగ్ సినిమాకు ఎలా ఎక్కువ థియేటర్లు ఇస్తారంటూ దిల్ రాజుపై విమర్శల వర్షం కురిపించారు. ఇక చేసేదేమి లేక వారసుడు విడుదల తేదీని 11 నుంచి 14వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. అయితే తమిళ వెర్షన్ మాత్రం జనవరి 11నే విడుదల కానుంది. వారసుడు వాయిదా పడటంతో బాలయ్య `వీర సింహారెడ్డి`(Veera Simha Reddy), చిరంజీవి `వాల్తేరు వీరయ్య` చిత్రాలకు లైన్ క్లియర్ అయింది. అయితే సంక్రాంతికి ఓ యంగ్ హీరో మూవీ విడుదల కాబోతోంది.
అదే సంతోష్ శోభన్ నటించిన `కళ్యాణం కమనీయం`. అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియ భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. ప్రభాస్ హోమ్ బ్యానర్ యూవీ క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కానుంది. సంక్రాంతికి తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ కళ్యాణం కమనీయం బరిలోకి దిగి అందరినీ ఆకర్షించింది. ట్రైలర్, టీజర్ కూడా సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. మేకర్స్ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నారు. అయితే వారసుడును 14వ తేదీకి షిఫ్ట్ చేసిన దిల్ రాజు.. కళ్యాణం కమనీయం(kalyanam kamaneeyam) జనవరి 15కి వాయిదా వేసుకోవాలని సూచించాడట. కానీ, దిల్ రాజుకు యంగ్ హీరో ఝలక్ ఇచ్చాడట. తమ సినిమాను వాయిదా వేసుకునే ఆలోచనే లేదని సంతోష్ తో సహా చిత్ర టీమ్ చెప్పిందట. ఇది దిల్ రాజుకు పెద్ద షాక్ అని చెప్పొచ్చు. కళ్యాణం కమనీయం చిత్ర హీరో చిన్నవాడు అయినప్పటికీ నిర్మాణ సంస్థ పెద్దది. దీంతో వారు తమ సినిమా విడుదల వెనక్కి జరిపేది లేదంటున్నారు. అయితే ఈ నిర్ణయంతో మళ్లీ `వారసుడు` వాయిదా పడనుందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే, కళ్యాణం కమనీయం పోటీగా ఉన్నా.. వారసుడు చిత్రానికి దక్కాల్సిన థియేటర్స్ లో ఎలాంటి మార్పులు ఉండదు.