CINEMA

సంచలనానికి శ్రీకారం చుట్టిన డార్లింగ్…

ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరో గా నిలిచిన ప్రభాస్… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. డార్లింగ్ తాజా మూవీ సలార్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. సెప్టెంబర్ 28న థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా… మరింత మెరుగైన్ ఔట్ ఫుట్ కోసం కొన్ని సన్నివేశాలను రీషూట్ జరుపుకుంది. కొత్తగా ఒక ఐటమ్ సాంగ్ ను జతచేర్చి డిసెంబరు 22వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

 

వచ్చే నెల మొదటి వారం నుంచి డార్లింగ్ నాన్ స్టాప్ గా సలార్ ప్రమోషన్స్ లో పాల్గొననున్నాడు. డిసెంబర్ ఒకటో తేదీన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. ఇప్పటికై విడుదలైన టీజర్ కు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ ముఖాన్ని సరిగ్గా చూపించలేదనే విమర్శలు వచ్చాయి. ట్రైలర్ తో ప్రేక్షకులలో దీనిపై ఓ ఊపు వస్తుందని భావిస్తున్నారు.

 

సలార్ కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ నార్త్ అమెరికాలో నిన్ననే ప్రారంభమయ్యాయి. ఆ దేశంలో ఉన్న ప్రధాన థియేటర్స్ లో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించారు. అరగంట లోనే 10 వేల టికెట్లు అమ్ముడు పోవడంతోపాటు రూ.మూడు లక్షల రూపాయల గ్రాస్ నెల రోజుల ముందే వచ్చేసిందంటున్నారు. కేవలం ప్రీమియర్ షోస్ ద్వారానే 2 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టాలని చిత్రయూనిట్ పట్టుదలతో ఉంది. ప్రస్తుతం ఈ సినిమాకు ఉన్న ఊపు చూస్తుంటే అది పెద్దగా కష్టమేం అనిపించడంలేదని, సులువుగా వచ్చేస్తాయని ట్రేడ్ పండితులు లెక్కకడుతున్నారు