మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం’వాల్తేరు వీరయ్య’తొలి రోజే సుమారు 50 కోట్ల వసూళ్ళను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఓ వైపు ‘వీర సింహా రెడ్డి’తో పోటీ వున్నా, ఈ స్థాయిలో తొలి రోజు వసూళ్ళను ‘వాల్తేరు వీరయ్య’ సాధించడం విశేషమే మరి.! 50 కోట్ల గ్రాస్‌ని తొలి రోజు ‘వాల్తేరు వీరయ్య’ కొల్లగొట్టగా, రెండో రోజు స్టడీగా వసూళ్ళు కనిపించే అవకాశం వుంది. సంక్రాంతి పండగ హంగామా.. వాస్తవంగా నేటి నుంచే మొదలయ్యింది. ఇది ‘వాల్తేరు వీరయ్య’కు అడ్వాంటేజ్ కాబోతోంది.
50 కోట్లు.. నాలుగో సినిమా.. ఓపెనింగ్ డే వసూళ్ళ పరంగా చూసుకుంటే,చిరంజీవిఐదో సారి 50 కోట్లను కొల్లగొట్టారు. గతంలో ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతోనూ, ఆ తర్వాత ‘సైరా’ సినిమాతోనూ చిరంజీవి ఈ ఫీట్ సాధించారు. చిరంజీవి కెరీర్‌లోనే అతి పెద్ద డిజాస్టర్ అయిన ‘ఆచార్య’ కూడా తొలి రోజు 50 కోట్ల పైనే కొల్లగొట్టింది. ఇక, ‘ఆచార్య’ ఫైనల్ స్కోర్ విషయమై సినీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గ్రాస్ లెక్కలైతే ఆదివారానికే 100 కోట్లు దాటెయ్యొచ్చు.