National

ఆదాయపు పన్నును ఆదా చేసేందుకు కొందరు అడ్డదారులు

ఆదాయపు పన్నును ఆదా చేసేందుకు కొందరు అడ్డదారులు వెతుకుతూ ఉంటారు. ఈక్రమంలో తప్పులు చేస్తారు. దానికి తగిన జరిమానాలు చెల్లించుకుంటారు. అయితే మీరు చట్టపరమైన మార్గంలో కూడా ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం అనేక ఆప్షన్లు ఇచ్చింది. ప్రతి పన్ను చెల్లింపుదారుడు ఈ చట్టబద్ధమైన పద్ధతులను ఉపయోగించడం ద్వారా పన్నును ఆదా చేసుకోవచ్చు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. అటువంటి పరిస్థితిలో.. మీరు మీ ఆర్థిక ప్రణాళికను ఇప్పటి నుంచే ప్రారంభించవచ్చు. ఈ ఐదు పద్ధతులను అనుసరించడం ద్వారా మీరు పన్నును కూడా ఆదా చేసుకోవచ్చు. జాతీయ పెన్షన్ పథకం నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)లో పెట్టుబడి పెట్టినా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.

దీనిలో మీరు సెక్షన్ 80CCD (1B) కింద సంవత్సరానికి 1.5 లక్షలు , అదనంగా 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. NPSలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఆదాయపు పన్నులో మొత్తం రూ. 2 లక్షల మినహాయింపు ప్రయోజనాన్ని పొందొచ్చు. సుకన్య సమృద్ధి యోజన సుకన్య సమృద్ధి యోజన (SSY)లో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఆదాయపు పన్ను మినహాయింపు పొందొచ్చు. కేంద్ర ప్రభుత్వ ఈ పథకం ఆడపిల్లల కోసం. ప్రస్తుతం ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై 7.6 శాతం వడ్డీ అందుతోంది. ఇంతకుముందు, ఈ పథకంలో, ఇద్దరు కుమార్తెల ఖాతాపై మాత్రమే 80C కింద పన్ను మినహాయింపు అందుబాటులో ఉంది.

కానీ ప్రభుత్వం దానిని మార్చింది. కొత్త నిబంధన ప్రకారం, ఒక కుమార్తె తర్వాత ఇద్దరు కవల కుమార్తెలు పుడితే, వారి ఖాతాలో కూడా పన్ను మినహాయింపు ఇస్తారు. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ సీనియర్ సిటిజన్స్ (SCSS) కోసం ఇది గొప్ప పథకం. దీని కింద, పోస్టాఫీసు లేదా బ్యాంకులో పొదుపు ఖాతాలను తెరవవచ్చు. ఈ ఖాతాలో జమ చేసిన మొత్తంపై 80సీ కింద ఆదాయపు పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. ఇందులో మీరు ఏటా గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో పెట్టుబడిపై 8 శాతం వడ్డీని అందుకుంటున్నారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ప్రస్తుతం 7.1 శాతం వడ్డీని ఇస్తోంది. మీరు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, మీరు PPFలో ఏటా రూ. 1.5 లక్షల పెట్టుబడి పెడితే పన్ను మినహాయింపు పొందొచ్చు. PPFలో పెట్టుబడికి ప్రభుత్వం హామీ ఇస్తుంది.అంటే డబ్బు మునిగిపోదు. మీరు కూడా ఇలా డిస్కౌంట్ పొందొచ్చు