విశ్వనటుడు కమల్ హాసన్(Kamal Haasan) కుమార్తె, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గత రెండేళ్ల నుంచి డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో సపరేట్‌గా ఓ ఫ్లాట్ తీసుకుని అక్కడే వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. ఎప్పటికప్పుడు శృతి ప్రియుడితో సన్నిహితంగా దిగిన ఫోటోలను, వీడియోలను పంచుకుంటూ ఉంటుంది. అలాగే ఎయిర్ పోర్ట్ అయినా, సూపర్ మార్కెట్ అయినా చివరకు నడి రోడ్డు అయినా సరే రొమాన్స్ చేస్తూ శృతి-శాంతను ఎన్నో సార్లు వార్తలు నిలిచారు. మొన్నామధ్య వీరిద్దరూ విడిపోయారంటూ వార్తలు వచ్చినప్పటికీ.. శృతి హాసన్(Shruti Haasan) పరోక్షంగా అవి పుకార్లే అని తేల్చేసింది. ఇకపోతే ఇప్పుడు ఈ లవ్ బర్డ్స్ తమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారట.
అందులో భాగంగానే శృతి హాసన్, శాంతను హజారికా(Santanu Hazarika) పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఇప్పటికే కమల్ హాసన్ వీరి ప్రేమను అంగీకరించారు. ఈ ఏడాదిలోనే శృతి శాంతనుతో పెళ్లి పీటలెక్కబోతోందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చి నెట్టింట వైరల్ గా మారింది. త్వరలోనే శృతి పెళ్లిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా, శృతి హాసన్ తన కెరీర్ ప్రారంభంలో హీరో సిద్దార్థ్(Siddharth)తో ప్రేమలో పడినట్టుగా వార్తలు వచ్చాయి. ఇక ఆ తరువాత చాలా ఏళ్లకు లండన్ బేస్డ్ ఫోటో గ్రాఫర్ మైకేల్ కోర్సల్ తో ప్రేమలో పడింది. అతడితో కొన్నేళ్లు సహజీవనం చేసింది. అతగాడిని ఇండియాకి తీసుకొచ్చింది. ఫ్యామిలీకి పరిచయం చేసింది. అతడితో శృతి పెళ్లి దాదాపు ఖాయం అని అందరూ అనుకున్నారు. అంతలోనే అతడికి బ్రేకప్ చెప్పేసింది.