తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి కథానాయికలలో సావిత్రి (Savithri) ఆ తర్వాత సౌందర్య, స్నేహ వంటి హీరోయిన్ల తర్వాత ఈ తరం హీరోయిన్లలో ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయకుండా కేవలం తన నటనతోనే సినీ ప్రియులను ఆకర్షించిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారా అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు సాయి పల్లవి. అవును ప్రతి ఒక్కరూ సాయి పల్లవి పేరే చెబుతారు. ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయని నాచురల్ హీరోయిన్ అని సాయి పల్లవి కి పేరు వచ్చింది. అంతేకాదు ఈ హీరోయిన్ మేకప్ లు కూడా ఎక్కువగా వేసుకోదట. ఇక సాయి పల్లవి (Sai Pallavi) ప్రేమమ్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇక మొదటి సినిమాతోనే తన నటనతో అందర్నీ ఆకర్షించింది.
సాయి పల్లవి గ్లామర్ పాత్రలకు, రొమాంటిక్ సన్నివేశాలకు ఆమడ దూరంలో ఉంటుంది. తన సినిమాల్లో ఏమాత్రం వల్గారిటీ ప్రదర్శించకుండా సింపుల్ గా నాచురల్ గా ఉండే పాత్రలను ఎంచుకుంటుంది. ఇక ఈ మధ్యకాలంలో సాయి పల్లవి సినిమాల్లో కనిపించడం లేదు. ఇక ఈ విషయం పక్కన పెడితే సాయి పల్లవి గురించి ఒక షాకింగ్ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుంది. అదేంటంటే.. సాయి పల్లవి తన రెమ్యూనరేషన్ ని తీసుకున్నాక ఏం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. సాయి పల్లవికి (Sai Pallavi) నిర్మాత చెక్కు ఇవ్వగానే దాన్ని తీసుకొని ముందుగా సాయిబాబా దగ్గర పెట్టి పూజ చేసి ఆ తర్వాత ఆ చెక్కు ని తన అమ్మానాన్నల చేతుల్లో పెడుతుందట. ఇక సినిమాల్లో నటించినప్పటి నుండే కాకుండా సాయి పల్లవికి ఎప్పుడు డబ్బులు వచ్చినా కూడా అలాంటి పనే చేసేదట. ఇక ప్రస్తుతం ఈ విషయం తెలిసిన చాలామంది షాక్ అవుతున్నారు. ఈ జనరేషన్లో అలాంటి హీరోయిన్లు కూడా ఉన్నారా అని ముక్కున వేలేసుకుంటున్నారు.