పార్వతీపురం మన్యం జిల్లా : పార్వతీపురం మండలం డికె పట్నం పంచాయతీ దాహం కేకలు వినబడుతున్నాయి. గ్రామ మహిళలు కాళీబిందులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆపార్టీ పార్వతీపురం మన్యం జిల్లా నీటి సమస్యలు ఎక్కువగా ఉండటం వల్ల మాట్లాడుతూ గ్రామంలో మంచినీటి పైపులైన్లు, మంచి నీటి ట్యాంక్ అలంకరణకే తప్ప ప్రజల దాహం తీర్చడం లేదని ఆరోపించారు. రెండు మూడు రోజులు గా ఆ గ్రామంలో ఇదే దుస్థితి అని మండిపడ్డారు. ఫలితంగా ప్రజలు చేతిపంపులు, నూతులు బావిలు మీద ఆధారపడాల్సి వస్తుందని అన్నారు. ఇక వేసివి కాలంలో అయితే తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కుంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి మంచి నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. అలాగే గ్రామ ప్రజలు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రజాప్రతినిధులు ఓట్లు కోసం వస్తారే తప్ప సమస్యలను మాత్రం పెడ చెవిని పెడుతున్నారని మూడు రోజుల్లో సమస్యపరిష్కరించని యెడల గ్రామ సచివాలయం కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తామని అన్నారు.