CINEMA

పెళ్లైన రెండు సంవత్సరాలకే భార్యకి విడాకులు ఇవ్వబోతున్న స్టార్ హీరో.. ఎవరంటే..?

: ఇటీవల కాలంలో చాలా మంది సినీ సెలబ్రిటీలు పెళ్లైన కొన్ని రోజులకే విడాకుల బాట పడుతున్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని సంవత్సరం కూడా గడవకముందే అభిప్రాయ బేధాలు రావడంతో విడాకులు అంటూ విడిపోతున్నారు. ఇక మరికొంత మందేమో అభిప్రాయాలు కలిసాక పెళ్లిలు చేసుకొని కొన్ని రోజులు కాపురాలు చేశాక కూడా మధ్యలో వచ్చే లేనిపోని విషయాల గురించి విడాకులు తీసుకుంటున్నారు.ఇక మరికొంత మందేమో ఇతరుల మోజులో పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఇక ఇంకొంతమందయితే 10, 20 సంవత్సరాలు కాపురాలు చేసి కూడా పిల్లల భవిష్యత్తును అంధకారం లోకి నెట్టేసి విడాకులు అంటూ విడిపోతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా టాలీవుడ్ లో ఉన్న ఓ యంగ్ హీరో (Star Hero) కూడా విడాకులు తీసుకోవడానికి రెడీ అవుతున్నారట. ఇక ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ యంగ్ హీరో సినీ కెరియర్ బాగున్నప్పటికీ పర్సనల్ కెరియర్ మాత్రం అంత బాగా లేదట. ఈ హీరో పెళ్లి చేసుకొని కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అవుతుంది. కానీ తన భార్య కు తనకి మధ్య తరచూ గొడవలు రావడంతో విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యాడట.అయితే దీనికి ప్రధాన కారణం ఆ హీరో ఒక హీరోయిన్ మోజులో పడ్డారట. ఇప్పటికే ఆ హీరోయిన్ తో కలిసి ఈ హీరో రెండు సినిమాల్లో నటించారట. ఇక సినిమాలో నటించే టైంలో వీరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడి అధి కాస్త ప్రేమగా మారిందట. ఈ కారణం తోనే తన భార్యతో తరచూ గొడవలు పెట్టుకుంటూ ఆమెను విసిగిస్తున్నారట. ఇక హీరో (Star Hero) భార్య కూడా తన భర్త చేసే గొడవని సహించలేక విడాకులు తీసుకుందామని మొహం మీద చెప్పేసిందట. ఇక గత ఆరు నెలల నుండి ఈ యంగ్ హీరో అతని భార్య ఇద్దరు వేర్వేరుగానే ఉంటున్నారట. ప్రస్తుతం వీళ్ళు కోర్టులో విడాకులకు కూడా అప్లై చేశారని సమాచారం. ఇక త్వరలోనే ఆ యంగ్ హీరో ఎవరో అఫీషియల్ గా బయటపడనుంది. అయితే ఈ విషయం తెలిసి చాలామంది నెటిజన్స్ ఇంతకీ ఆ యంగ్ హీరో ఎవరబ్బా అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు.