AP

అంతర్ జిల్లాల ఆర్చరీ చాంపియన్ షిప్ పోటీలు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభం

పార్వతీపురం లో ప్రారంభమైన అంతర్ జిల్లాల ఆర్చరీ చాంపియన్ షిప్ పోటీలు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. పార్వతీపురం జూనియర్ కళాశాల ప్రాంగణంలో 66వ ఆంధ్ర ప్రదేద్ ఆర్చరీ పోటీలు ప్రారంభమయ్యాయి. 2023-2024 సంవత్సరపు అంతర జిల్లాల అండర్ 14 – 17 సంవత్సరాల బాలబాలికల విలువిద్యా క్రీడా పోటీలను జాయింట్ కలెక్టర్ ఓ. ఆనంద్, పోలీసు సూపరింటెండెంట్ వి. విద్యాసాగర్ నాయుడు జ్యోతి ప్రజ్వన, జాతీయ జెండా ఆవిష్కరించి ప్రారంభించారు. పోటీలు 15వ తేదీ వరకు మూడు రోజులు జరగనున్నాయి. ఈ విలువిద్యా పోటీలు రిజర్వు, కాంపౌండ్, ఇండియన్ రౌండ్స్ అను 3 విభాగాల్లో నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో రాష్ట్రంలో గల ఉమ్మడి13 జిల్లాల నుండి బాలురు 250 మంది, బాలికలు 250 మంది , 15 మంది సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ , జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వి.విద్యా సాగర్ నాయుడు మాట్లాడుతూ… క్రీడాకారులు అందరూ ఆత్మ స్టైర్యంతో, పట్టుదలతో ఏకాగ్రతతో ఆడాలని అలా ఆడితే పతకాలు సిద్ధిస్తాయని చెప్పారు.

కార్యక్రమంలో జిల్లా క్రీడల చీఫ్ కోచ్ ఎస్. వెంకటేశ్వర రావు, విద్యశాఖాధికారి డా.ఎస్.డి.వి.రమణ, ఆర్చరీ సెక్రటరీ డి. గాంధీ, ప్రతినిధులు జి. భానుమూర్తి. ఎం. మనోహర్. తదితరులు పాల్గొన్నారు.