AP

ప్రభుత్వోన్నత పాఠశాలలో 1983-84వ సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక

కాకినాడ జిల్లా కిర్లంపూడి శ్రీ కొక్కొండ రామశేషగిరి రావు పంతులు ప్రభుత్వోన్నత పాఠశాలలో 1983-84వ సంవత్సర పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక ఘనంగా నిర్వహించారు.ముందుగా పాఠశాలకి చేరుకొని ఆనాటి మధుర జ్ఞాపకాలను ప్రతిఒక్కరూ నెమరు వేసికొన్నారు.ఈ సందర్భంగా విద్యాబుద్ధులని నేర్పించిన గురువులకు ఘన సన్మానం చేశారు.వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఆద్యంతం ఆనందంగా గడిపారు.ప్రతిఒక్కరూ ఒకరి ఒకరికి పరిచయం చేసికొని ఎవరికి ఏ అవసరం వచ్చినా అండగా ఉండాలని తెలియపరచారు.ఈ సందర్భంగా విద్యా బుద్ధులు నేర్పిన గురువులు మాట్లాడుతూ ఆనాటి తమ దగ్గర విద్యను అభ్యసించిన విద్యార్థులు ఈనాడు ప్రతి ఒక్కరూ ఉన్నత స్థితిలో ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.తమని గుర్తురేగి ఘనంగా సన్మానించిన ప్రతి విద్యార్థికి తమ ఆశీస్సులు మెండుగా ఉంటాయని దీవించారు.ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ చదలవాడ బాబీ మాట్లాడుతూ విద్యా బుద్ధులు నేర్పిన గురువుల వల్లే ఈరోజు ఉన్నత స్థాయిలో ఉండడానికి కారణమన్నారు.ఈ కార్యక్రమం ఇంత ఘన విజయం కావడానికి సహకరించిన తోటి స్నేహితులకి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కొల్లా సూరిబాబు,జోకా శ్రీను, గౌతు జగన్నాధరావు,కొత్త వీరబాబు,నీలగిరి వీరకుమార్,ఉండ్రు గంగాధర్, ఆడారి శ్రీను,సేనాపతి సన్యాసిరావు,చదరం శ్రీను,షేక్ అలీషా,కరణం దుర్గాప్రసాద్,నాగబట్ల సీతారామమూర్తి తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.