AP

జగన్ ని కాపాడబోయే బ్రహ్మాస్త్రం

ఓవైపు ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. మరోవైపు.. ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలపై దూకుడు పెంచాల్సిందే. అలా అయితేనే రెండోసారి అధికారంలోకి రాగలరు. లేదంటే.. కష్టమే. అందులోనూ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితమైన వ్యూహాలను రచించాలి కాబట్టి.. సీఎం జగన్ ఇప్పటి నుంచే పక్కా ప్లాన్ గా ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని సంక్షేమ పథకాలను ప్రారంభించారో అన్ని సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీలపై దుమ్ములేపుతున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగానే నవరత్నాలను అమలు చేశామని.. సంక్షేమ పథకాలు అందితేనే వచ్చే ఎన్నికల్లో తమకు ఓట్లేయండి అని జగన్ అడుగుతున్నారు.సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని సీఎం జగన్.. ప్రతి నెలా మూడు నాలుగు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ప్రతి చోటా తన సంక్షేమ పథకాల గురించే వివరిస్తున్నారు. గడిచిన మూడున్నరేళ్లలో ఏపీ ప్రభుత్వం ఏం చేసింది..

ఇంకా మున్ముందు ఏం చేస్తుంది.. మళ్లీ గెలిపిస్తే ఏం చేయబోతోంది.. అంటూ సంక్షేమ పథకాలు, ఏపీలో అభివృద్ధి గురించి ప్రజలకు సీఎం జగన్ స్పష్టంగా చెబుతున్నారు. అయితే.. ప్రతిపక్ష పార్టీలకు ఏపీ ప్రభుత్వంపై వ్యతిరేకంగా చెప్పడానికి చాలా అంశాలు ఉన్నాయి కానీ.. సంక్షేమ పథకాల విషయంలో మాత్రం ఏం చేయలేకపోతున్నాయి. YS Jagan attacking all parties with his welfare schemes in ap YS Jagan : జగన్ అమలు చేస్తున్న నవరత్నాలను ప్రతిపక్షాలు ఎందుకు కౌంటర్ చేయలేకపోతున్నాయి? ఎందుకంటే.. నవరత్నాల పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రతి ఇంటికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాన్ని అందిస్తోంది. ఈ విషయంలో ప్రతిపక్షాలు కూడా ఏం మాట్లాడలేకపోతున్నాయి. సంక్షేమ పథకాలు అమలు గురించి దాచేది ఏం లేదు. దీంతో వాటితో జగన్ ను విమర్శించలేక తర్జన భర్జన పడుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్. తన సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలపై జగన్ డైరెక్ట్ గా విరుచుకుపడుతున్నారు. ప్రతిపక్షాలు తనపై చేసే ఆరోపణలనే తనకు ఆయుధంగా మార్చుకుంటున్నారు. ప్రతిపక్షాలు చేసేది లేక.. తాము అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పడం తప్పించి ఏం చేయలేకపోతున్నారు.