తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కల్ట్ క్లాసిక్ మూవీలతో భారీ పాపులారిటీ అందుకున్న హీరోయిన్ ఆమని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. శుభలగ్నం, శుభసంకల్పం ,మావిచిగురు ఇలా ఎన్నో క్లాసిక్ చిత్రాలలో నటించి మెప్పించిన ఈమె.. కె విశ్వనాథ్ సహా ఎంతో మంది దిగ్గజ దర్శకులతో పనిచేసిన ఘనత ఆమె సొంతం. ఆమని (Amani) సినీ పరిశ్రమలో అగ్ర నటుల సరసన కథానాయకగా నటించి మెప్పించారు. దశాబ్దాల కెరియర్ లో అగ్రనాయికగా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఇప్పటికి కూడా పలు సినిమాలలో నటిస్తూ దూసుకుపోతోంది. నిజానికి ఒక సీనియర్ హీరోయిన్గా ఆమనిని అప్పట్లో చాలామంది గౌరవించే వాళ్ళు. ఇప్పటికీ ఎప్పటికీ అభిమానులు మాత్రం ఆమనిని మరిచిపోరని చెప్పడంలో సందేహం లేదు ..ఇకపోతే ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బాగానే అవకాశాలు అందుకుంటున్న ఈమె.. ఒకవైపు టీవీ షోలకు హోస్టుగా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నారు..
ముఖ్యంగా సినిమాలకంటే టీవీ కాన్సెప్టులు ఆమెకు మరింత పాపులారిటీ తీసుకొస్తున్నాయి.. ఇదిలా ఉండగా తాజాగా తన కెరియర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ.. నేను ఏ సినిమా ఆఫీసుకి వెళ్లినా మా అమ్మ వెంట రావడం వల్ల సినిమా ఆఫీసులో కొంతమందికి నచ్చేది కాదు . అమ్మ లేకుండా ఆఫీస్ కి ఒంటరిగా రమ్మని చెప్పేవాళ్ళు. నేను కూడా అంతే దీటుగా సమాధానం ఇచ్చేదాన్ని.. అమ్మ లేకుండా నేను రాను అని కరాకండిగా చెప్పేదాన్ని. అయితే ఒకానొక సమయంలో పక్కలోకి వస్తేనే అవకాశాలు ఇస్తామంటూ చాలా చెత్తగా మాట్లాడారు.. కానీ అక్కడి నుంచి వారికి ఘాటుగా సమాధానం ఇచ్చి వెళ్లిపోయాను.. నిజానికి ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అనేది తెలియడానికి చాలా సమయం పట్టింది. అప్పుడే నాన్న చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆయన మొదటి నుంచి సినిమాల వైపుకు వెళ్ళవద్దు అని చెప్పేవారు. అయినా కూడా నేను అన్నింటిని దీటుగా ఎదుర్కొని ఈ స్థాయిలో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది ఆమని.