CINEMA

తండ్రైన నవీన్ చంద్ర.. పుత్రోత్సాహంలో దంపతులు..!

హీరో నవీన్ చంద్ర (Naveen Chandra) తాజాగా తండ్రి అయ్యారు. ఆయన భార్య ఓర్మా (Orma) బుధవారం రాత్రి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.. ఈ విషయాన్ని తాజాగా నవీన్ చంద్ర వెల్లడించారు. అంతేకాదు చిన్నారితో దిగిన ఫోటోలను కూడా ఆయన పంచుకున్నారు.. ‘నేను, ఓర్మా కుమారుడి తో ఆశీర్వదించబడ్డాము’ అని తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.. అప్పుడే పుట్టిన ఆ చిన్నారి కాలును ముద్దాడుతూ నవీన్ చంద్ర ఆనందాన్ని పంచుకున్నారు. మరొకవైపు చిన్నారి కాలుతో టచ్ చేయించుకుంటూ తండ్రిగా పుత్రోత్సాహాన్ని పొందుతున్నారు. తాజాగా ఆయన పంచుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి. అంతే కాదు ప్రతి ఒక్కరు నవీన్ చంద్ర, ఓర్మా దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా టాలీవుడ్ లో హీరోగా, విలన్, విలక్షణటుడిగా రాణిస్తున్న నవీన్ చంద్ర ఎప్పుడు కూడా తన పర్సనల్ లైఫ్ ని బయట పెట్టలేదు.

పెళ్లి , భార్యకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించలేదు. కానీ గత ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా తన భార్య ఓర్మా ని అందరికీ పరిచయం చేశారు. తనలో సగం అంటూ ఆమెపై ప్రేమను పంచుకున్నారు. సరిగా ఏడాది తర్వాత తాను తండ్రి కావడం నిజంగా విశేషం. నవీన్ చంద్ర మొదటిసారి అందాల రాక్షసి చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో వివిధ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత దళం, భం భోలేనాథ్, నా రాకుమారుడు ,త్రిపుర , లచ్చిందేవికి ఓ లెక్కుంది, మీలో ఎవరు కోటీశ్వరుడు, నేను లోకల్, దేవదాస్, అమ్ము, రంగ రంగ వైభవంగా, గని, విరాటపర్వం, మిస్ ఇండియా అంటూ రకరకాల సినిమాలలో విలన్ గా హీరోగా నటించిన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మరొకవైపు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ నటుడిగా నిరూపించుకుంటున్నారు.. ఇటీవలే ఓటీటీ లో మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ గా నిలుస్తున్నారు నవీన్ చంద్ర.