మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సతీమణి, మెగా కోడలు ఉపాసన గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ప్రముఖ వ్యాపార వేత్త, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి మనమరాలు అయిన ఉపాసన.. లండన్ రీజెన్ట్స్ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా అందుకుంది. చిన్నతనం నుంచే వ్యాపార సామ్రాజ్యంలో మెలుకవలు నేర్చుకున్న ఉపాసన.. 2012లో రామ్ చరణ్ తో ఏడడుగులు వేసింది. వీరిది ప్రేమ వివాహం. వివాహం అనంతరం ఓవైపు మెగా కోడలిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూనే.. మరోవైపు అపోలో హాస్పిటల్(apollo hospital) వైస్ చైర్మన్ గా పాతికేళ్లకే ఒత్తిడితో కూడిన బాధ్యతలు తీసుకుంది. అలాగే `బి పాజిటివ్` అనే హెల్త్ మ్యాగజైన్ కు ఎడిటర్ గా ఉన్నారు. మరోవైపు ఎన్నో సేవా కార్యక్రమాల్లో బాగమైన ఉపాసన.. త్వరలో తల్లిగా ప్రమోట్ కాబోతోంది.
చరణ్ తో పెళ్లి అయితే పదేళ్ల తర్వాత ప్రెగ్నెంట్ అయిన ఉపాసన(Upasana).. మరి కొద్ది రోజుల్లోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో తనపై వస్తున్న నెగటివ్ కామెంట్స్ పై ఉపసాన స్పందించింది. చాలా మంది ఉపాసన గోల్డెన్ స్పూన్ తో పుట్టిందంటూ ఎద్దేవ చేస్తున్నారు. ఈ మాటలకు ఆమె బాగా హట్ అయింది. ఇటువంటి కామెంట్స్ పై మెగా కోడలు తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. చాలా మంది తాపే గోల్డెన్ స్పూన్ తో పుట్టానని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ, తన తల్లీదండ్రులు ఎంతో కష్టపడ్డారని ఉపాసన ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. అలాగే తాను తన తల్లిదండ్రుల సంపాదన మీద ఏమీ ఆధారపడలేదని, రెస్ట్ లేకుండా నిరంతరం వృత్తిపరమైన బాధ్యతలతో బిజీగా ఉన్నానని ఉపాసన(Upasana) చెప్పుకొచ్చారు. తన పిల్లల్ని కూడా నిరంతర వృత్తిపరమైన బాధ్యతలతో పెంచుతామని స్పష్టం చేసింది. అలాగే ఇకపై తన గురించి నెగిటివ్ గా రాయొద్దంటూ కూడా ఉపాసన రిక్వెస్ట్ చేసింది.