CINEMA

కట్టప్ప కూతురును ఎప్పుడైనా చూశారా.. హీరోయిన్లు కూడా దిగదుడుపే!

విలక్షణ నటుడు సత్యరాజ్(sathyaraj) గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కోలీవుడ్ లో విలన్ గా కెరీర్ ప్రారంభించిన సత్యరాజ్‌.. ఆ తర్వాత హీరోగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. మరోవైపు ప్రతినాయక పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. తమిళ రెబల్ స్టార్ గా ఓ వెలుగు వెలిగారు. అలాగే సహాయక పాత్రల్లోనూ అలరించాడు. పాత్ర ఏదైనా సత్యరాజ్ వంద శాతం న్యాయం చేస్తాడు.

ఇక దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన `బాహుబలి`(Bahubali) ద్వారా సత్యరాజ్ రేంజ్ మరో స్థాయిలో వెళ్లింది. ఇందులో కట్టప్ప పాత్రలో సత్యరాజ్ అదరగొట్టేశాడు. బాహుబలి సినిమాకు ప్రధాన బలంగా నిలిచిన పాత్రల్లో కట్టప్ప ఒకటి. ఇకపోతే సత్యరాజ్ వ్యక్తిగత విషయాల గురించి చాలా మందికి తెలియదు ఆయన భార్య పేరు మహేశ్వరీ. ఈ దంపుతలకు ఇద్దరు సంతానం.