CINEMA

సాంగ్స్ కోసమే భారీగా ఖర్చు.. ఏకంగా ఐదుగురు టాప్ కొరియోగ్రాఫర్స్!

సౌత్ ఇండస్ట్రీలోని అత్యధిక భారీ బడ్జెట్లో సినిమాలను తెరపైకి తీసుకువచ్చే దర్శకులలో శంకర్ ఒకరు. ఒక విధంగా ఇండియాలోనే బడ్జెట్ తో అంచనాలను పెంచిన ఏకైక దర్శకుడు శంకర్ చెప్పవచ్చు.

ఆయన ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ప్రతి ఒక్కటి కూడా చాలా కాస్ట్లీ గా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సాంగ్స్ కోసం కూడా శంకర్ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

సాంగ్స్ సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉండాలి అని మ్యూజిక్ నుంచి కొరియోగ్రఫీ వరకు చాలా డిఫరెంట్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక రాంచరణ్ 15వ సినిమాలో కూడా సాంగ్స్ హైలైట్ అయ్యే విధంగానే శంకర్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అందులో మొత్తంగా ఐదు మంది టాప్ ఇండియన్ కొరియోగ్రాఫర్స్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం.

జానీ మాస్టర్ తో పాటు ప్రేమ్ రక్షిత్ అలాగే ప్రభుదేవా, గణేష్ ఆచార్య, బోస్కో మార్టిస్ ఈ ఐదుగురు టాప్ కొరియోగ్రాఫర్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఒక సాంగ్ కోసమైతే ముగ్గురు టాప్ కొరియోగ్రాఫర్స్ వర్క్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ విషయాలను చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ లో తెలియజేయనుంది. మొత్తానికి దర్శకుడు శంకర్ అయితే ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ ని వాడుతున్నట్లు అర్థమవుతుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

ఇక కేవలం సాంగ్స్ మేకింగ్ కోసమే RC15 సినిమాలో మొత్తం గా రూ.40 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఏ సినిమా కూడా సాంగ్స్ కోసం ఈ రేంజ్ లో అయితే బడ్జెట్ ఖర్చు అవ్వలేదు. దిల్ రాజు కూడా బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయకుండా శంకర్ ఆలోచనలకు తగ్గట్లుగానే ఖర్చు చేస్తున్నారు. మరి ఈ సినిమా మొత్తంగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి. ఇక సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేసే అవకాశం ఉంది.