CINEMA

ఓటీటీలో చెత్త కంటెంట్ రావడానికి దర్శకుడు ఆర్జీవీ వల్లనే

ఈ నడుమ ఓటీటీలో దారుణమైన కంటెంట్ వస్తోంది. సిరీస్ లు, సినిమాల్లో ఓ రేంజ్ లో రొమాన్స్, అడల్ట్ కంటెంట్ ఉంటుంది. మితిమీరిన శృంగారం, రొమాంటిక్ సీన్లు ఉంటున్నాయి.

దాంతో వాటిపై దారుణంగా విమర్శలు వస్తున్నాయి. ఓటీటీకి కూడా సెన్సార్ ఉండాల్సిందే అనే డిమాండ్ తెర మీదకు వస్తోంది. మొన్న వచ్చిన రానా నాయుడు ఎంత దారుణంతో ఉందో అందరికీ తెలిసిందే.

ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ఈ సిరీస్ మీద ప్రత్యేకంగా స్పందించింది. అయితే తాజాగా ఈ ఇష్యూ మీద బాలీవుడ్ స్టార్ హీరో
సల్మాన్ ఖాన్
స్పందించారు. 68వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఈవెంట్లో పాల్గొన్న సల్మాన్ ఖాన్ ని ఓటీటీ కంటెంట్ లో చోటు చేసుకుంటున్న అస్లీలత గురించి మాట్లాడారు.

నే కారణం. మొదట ఆయనే అడల్ట్ కంటెంట్ సినిమాలు తీసి ఓటీటీలో రిలీజ్ చేశారు. దాంతో ప్రేక్షకులు కూడా వాటికి బాగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు అలాంటి కంటెంట్ ఉన్న సిరీస్ లు బాగా వస్తున్నాయి. ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర కూడా మొబైల్ ఉంటుంది.

ఇలాంటి కంటెంట్ తో వారు చెడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఓటీటీకి కూడా సెన్సార్ బోర్డు అవసరం అని నొక్కి మరీ చెప్పారు సల్మాన్ ఖాన్. ఆర్జీవీపై ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మరి ఆయన వ్యాఖ్యలపై ఆర్జీవీ ఏమైనా స్పందిస్తారా లేదా అనేది మాత్రం చూడాలి.