APNationalTELANGANA

ప్రధాని మోడీ రాక నేపథ్యంలో బీఆర్‌ ఎస్ నేతల వెరైటీ నిరసన..!

: ఈ మధ్య బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్‌ ఎస్ నేతలు గట్టిగా వాయిస్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మోడీ తెలంగాణకు వచ్చిన ప్రతిసారి బీఆర్‌ ఎస్ నేతలు వ్యతిరేక నినాదాలు వినిపిస్తున్నారు.

ఇక తాజాగా
వందే భారత్ ఎక్స్ ప్రెస్
ను సికింద్రా బాద్ నుంచి తిరుపతికి కేటాయించిన సంగతి తెలిసిందే.

నేడు ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ ట్రైన్ ను ప్రారంభించనున్నారు. అయితే మోడీ వస్తున్న నేపత్యంలో బీఆర్‌ ఎస్ నేతలు వెరైటీ నిరసన చేపట్టారు. బీఆర్ఎస్ నేత, టీఎస్ రెడ్ కో చైర్మన్ వై సతీష్‌ రెడ్డి ఆధ్వర్యంలో బర్రెలకు వినతి పత్రాలు ఇచ్చారు. మోడీ వస్తున్న నేపథ్యంలో రైల్వే ట్రాక్ వద్దకు బర్రెలు రావొద్దంటూ కోరారు.

 

అంటే గతంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు రెండు సార్లు గేదెలను ఢీకొనడంతో అవి చనిపోయాయి. దాంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మరోసారి గేదెలు బలికావొద్దంటూ వారు కోరారు. ఒక రకంగా ఇది మోడీ రాకను వ్యతిరేకిస్తూ చేసిన నిరసన అని చెప్పుకోవాలి.