CINEMA

‘ఆర్ఆర్ఆర్’ కి ఇచ్చే గౌరవం ఇదేనా?: నిర్మాత కె ఎస్ రామారావు

ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు ఆస్కార్ దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్( RRR)’ చిత్ర బృందానికి సరైన గౌరవం దక్కలేదని ప్రముఖ సినీ నిర్మాత కేఎస్ రామారావు( KS Ramarao) అభిప్రాయపడ్డారు.

అవార్డు గ్రహీతలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఘనంగా సన్మానించాలని అన్నారు. రెండు ప్రభుత్వాలు తమ రాజకీయాలను పక్కనపెట్టి వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇతర రంగాల్లో అవార్డులు గెలుచుకున్న వారిని ప్రభుత్వం సత్కరిస్తుందని, కళాకారులకు అగౌరవం ఎందుకు దక్కడం లేదని ప్రశ్నించారు. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విషయంపై మాట్లాడారు.

‘ తెలుగు సినీ పరిశ్రమకు తొలి ‘ఆస్కార్’ అందజేసిన ఘనత ‘ఆర్ఆర్ఆర్’ కు బృందాని కే దక్కుతుంది. ఈ సినిమా కి అవార్డు రావడం పై చాలామంది నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. అవి విన్నప్పుడు చాలా బాధనిపించింది. ఆస్కార్ అనేది కళాకారులకు ఇచ్చే అత్యుత్తమ అవార్డు. అలాంటి అవార్డు వరించాలంటే దాని వెనుక ఎంతో కృషి ఉండాలి. ఆ సినిమాను సెలక్షన్ కమిటీ వరకు తీసుకెళ్లాలంటే ఎంతో పోటీని తట్టుకోవాలి. వాటన్నింటినీ దాటుకొని సెలెక్షన్ కమిటీ వరకు వెళ్లిన అన్ని సినిమాలు ఆస్కార్ ను గెలుచుకోలేవు. కానీ మన తెలుగు సినిమాను అవార్డు వరించిందంటే దానికి అర్హత ఉందని నా అభిప్రాయం. దాన్ని సార్ధకం చేసిన మన కీరవాణి( MM Keeravani) చంద్రబోస్( Chandrabose) లను ప్రభుత్వాలు విస్మరించడం ఆవేదన కలిగించింది’ అని అన్నారు